![]() |
![]() |
.webp)
సోషల్ మీడియాలో అష్షు రెడ్డి అల్లరి, ఆ రచ్చ మాములుగా ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూతో సెన్సేషన్ సృష్టిస్తూనే ఉంటుంది. కానీ ఈ మధ్య కొంత సైలెంట్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ విషయాన్ని నోటీస్ చేసిన కొంతమంది ఫాన్స్ కూడా ఆమెను ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఇక అష్షు పాపా మాట్లాడుకుందామా అని అడిగేసరికి ఇదే టైం అని ఫాన్స్ వాళ్లకు నచ్చిన ప్రశ్నలు అడిగేసారు..అందులో ఫస్ట్ ప్రశ్న ఇదే "ఈ మధ్య కాలంలో మీరు డిసిప్లిన్ గా మారడానికి కారణాలు ఏమిటి" అనేసరికి "నేను మెంటల్ గా, ఫిజికల్ గా కూడా చాలా డెవలప్ కావాలనుకుంటున్నా..అలా ఎదగాలనుకున్నప్పుడు మొదటగా అలవాటయ్యేది డిసిప్లిన్..
నాలో మార్పును గమనించినందుకు థ్యాంక్యూ" అని చెప్పింది. "ఉదయాన్నే 4 గంటలకు ఎలా లేస్తారు" " రోజు రాత్రి త్వరగా నిద్రపోతే..ఉదయాన్నే లేచేలా నన్ను నేను పరీక్షించుకుంటాను..కన్సిస్టెన్సీ అనేది నా ఫ్రెండ్ దగ్గర నుంచి నేర్చుకున్నా" "హారర్, కామెడీ, యాక్షన్, రొమాన్స్ మూవీస్ ఏది ఇష్టం" "నాకు డిస్నీ మూవీస్" అంటే ఇష్టం. "బిగ్ బాస్ లో చూసిన అష్షు యేనా..లేదా ఏదైనా పారలల్ యూనివర్స్ కి వచ్చానా" "చాలా కష్టపడుతున్నా..నా ట్రైనర్స్ కి వాళ్ళ ఓపికకు నా ధన్యవాదాలు" అని చెప్పింది అష్షు..ఏదేమైనా ఈరోజుల్లో అందరూ హెల్త్ మీద వర్క్ మీద చాల కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అలాగే జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఫిజిక్ ని చాల మెయింటైన్ చేస్తూ హెల్తీగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక అష్షు కూడా అదే బాటలో 5 గంటలకల్లా జిమ్ లో ప్రత్యక్షమవుతోంది. జిమ్ కి జతగా మెడిటేషన్ కూడా చేయండి అంటూ ఆమె డెడికేషన్ కి ఫిదా ఐపోయిన ఆమె ఫాన్స్ ఇలా సలహా కూడా ఇస్తున్నారు.
![]() |
![]() |